Nandyal: నంద్యాలలో వినాయక చవితిపై ఆంక్షలు.. రసాయన రంగులపై నిషేధం: వన్ టౌన్ సీఐ
Nandyal: వినాయక చవితి వేడుకల్లో గంధం పొడి పేరిట రసాయన పొడులు వాడినా, విక్రయించినా కఠిన కేసులు తప్పవని నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.
Nandyal: నంద్యాలలో వినాయక చవితిపై ఆంక్షలు.. రసాయన రంగులపై నిషేధం: వన్ టౌన్ సీఐ
Nandyal: నంద్యాలలో వినాయక చవితి వేడుకలపై పోలీసుల ఆంక్షలు..రసాయన పొడుల విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు..ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి..
వినాయక చవితి వేడుకల నేపథ్యంలో నంద్యాల వన్ టౌన్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలు, ప్రజారోగ్యం, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా వినాయక నిమజ్జనం సందర్భంగా గంధం పొడి పేరుతో విక్రయించే రసాయన పొడులను విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వినాయక చవితి వేడుకల నేపథ్యంలో నంద్యాల పట్టణ ప్రజలకు, వ్యాపారులకు, వినాయక విగ్రహాల నిర్వాహకులకు 1-టౌన్ పోలీసులు పలు సూచనలు చేశారు.
వినాయక చవితి పూజా సామాగ్రి, మట్టి విగ్రహాలు, అరటి ఆకులు, మామిడి ఆకులు తదితర వస్తువుల విక్రయాల కోసం టెక్కే మార్కెట్ యార్డ్‌లో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వ్యాపారులు తమ స్టాళ్లను నిర్ణీత ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకుని విక్రయాలు కొనసాగించాలని సూచించారు.
పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు కూడా తమ వాహనాలను నిర్ణయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపివేయాలని పోలీసులు సూచించారు. రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక వినాయక నిమజ్జనం, ఊరేగింపు సమయంలో గంధం పొడి పేరుతో విక్రయించే పసుపు రంగు రసాయన పొడుల వినియోగంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ రసాయన పొడులను శరీరానికి పూసుకున్న తర్వాత అదే చేతులతో ప్రసాదాలు తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సీఐ తెలిపారు.
అందువల్ల పట్టణంలోని షాపుల యజమానులు, కుంకుమ, రంగుల వ్యాపారులు ఇలాంటి రసాయన పొడులను విక్రయించకూడదని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి రసాయన పొడులను విక్రయించినా, నిమజ్జనం ఊరేగింపులో వాటిని వినియోగించినా చట్టప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని 1-టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.
ప్రజలంతా పోలీసు శాఖకు సహకరించి, వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా, ఆరోగ్యకరంగా జరుపుకోవాలని పోలీసులు కోరారు.




