Nandikotkur: 119 రోజులుగా శ్రీశైలం బాధితుల దీక్షలు!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో జిఓ 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం ముంపు బాధితుల 119 రోజుల దీక్ష. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేతల సంఘీభావం.
Nandikotkur: 119 రోజులుగా శ్రీశైలం బాధితుల దీక్షలు!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో రాష్ట్రాభివృద్ధి కోసం తమ ఇల్లు, పొలం, యావదాస్తిని త్యాగం చేసిన శ్రీశైలం ముంపు బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ముంపు బాధితులు గత 119 రోజులుగా రిలే నిరాహార దీక్షలు. GO 98 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్.
ఈ దీక్షా శిబిరాన్ని CPI(ML) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత.బంగార్రావు, AICTU రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కిరణ్, ఉమ్మడి జిల్లా CPI(ML) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు తదితర నేతలు సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా బంగార్రావు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం సర్వం కోల్పోయిన ముంపు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్య్,ఎం. పి లు కనీసం పరామర్శకు కూడా రాకపోవడం బాధితుల పట్ల వారికున్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఆర్థిక భారం ఏమాత్రం పడని పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ప్రపోజల్ పంపినా, పైస్థాయిలో ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రభుత్వ మొండివైఖరికి నిదర్శనమని అన్నారు.
ముంపు బాధితుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి మరియు డిప్యూటీ CM పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
CPIML జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలోని ముగ్గురు ముఖ్య నాయకులు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ముంపు బాధితులను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. ఇప్పటికే 32 మంది బాధితులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. నాలుగు నెలలుగా కాలే కడుపుతో దీక్షలు చేస్తున్న బాధితుల సమస్యను పరిష్కరించకపోవడం సిగ్గుచేటని అన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు CPIML లిబరేషన్ పార్టీ బాధితుల తరపున పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో CPIML రాష్ట్ర కమిటీ సభ్యులు B. మునిస్వామి, AICCTU రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, జిల్లా నాయకులు S. రసూల్, మహేంద్ర, B. లక్ష్మీదేవి, నూర్జహాన్, M. చంద్రశేఖర్, V. సుధాకర్, G. త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.
దీక్షలో ముంపు బాధితులు నాగేంద్రుడు, జమ్మన్న, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, వెంకటేష్, నాగరాజు, నాగసుంకన్న, మౌలాలి, శాలమ్మ, రాణెమ్మ, శ్యామలమ్మ, రాజేశ్వరి, జయన్న తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.




