Nandyal: నంద్యాలలో భార్య అదృశ్యం, చిన్నారి లభ్యం ఘటనలో వీడని మిస్టరీ
Nandyal: నంద్యాల శివారులో భార్య స్పందన అదృశ్యం, ముళ్లపొదల్లో నెల రోజుల చిన్నారి లభ్యం. బెంగళూరు ఆసుపత్రిలో స్పందన అపస్మారక స్థితి. వీడుతున్న మిస్టరీ.
Nandyal: నంద్యాలలో భార్య అదృశ్యం, చిన్నారి లభ్యం ఘటనలో వీడని మిస్టరీ
నంద్యాల: నంద్యాల లో భార్య, నెల రోజుల చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. నంద్యాల పట్టణ శివారులోని అయ్యలూరి మెట్ట వద్ద భర్తను బురిడీ కొట్టించి భార్య స్పందన అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అయ్యలూరు సమీపంలోని ముళ్లపొదల్లో నెల రోజుల చిన్నారి లభ్యం కావడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ శివనాగరాజుకు, కామినేనిపల్లెకు చెందిన స్పందనతో రెండేళ్ల క్రితం వివాహమైంది. నెల రోజుల క్రితం స్పందన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఆరు రోజుల క్రితం భార్య స్పందన, నెల రోజుల కుమార్తెతో కలిసి శివనాగరాజు బైక్‌పై నంద్యాలకు బయలుదేరాడు. అయ్యలూరు సమీపంలో వాంతులు వస్తున్నాయని స్పందన చెప్పడంతో ఆమెను ఆటోలో పంపించినట్లు భర్త చెబుతున్నాడు. అయితే ఆ తర్వాత భార్య, చిన్నారి కనిపించకపోవడంతో శివనాగరాజు నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇదిలా ఉండగా బెంగళూరులోని రైల్వే ఆసుపత్రిలో స్పందన గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నట్లు నంద్యాల పోలీసులకు సమాచారం అందింది. దీంతో కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న స్పందనను చూసిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చారు.
మరోవైపు అయ్యలూరు సమీపంలోని ముళ్లపొదల్లో నెల రోజుల చిన్నారి లభ్యమైంది. చిన్నారిని పోలీసులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే స్పందన అదృశ్యం కావడం, చిన్నారి ముళ్లపొదల్లో లభ్యం కావడం, స్పందన బెంగళూరులోని ఆసుపత్రిలో ఉండటానికి మధ్య సంబంధం ఏమిటనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. రెండు ఘటనలకు సంబంధం లేదన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అపస్మారక స్థితిలో ఉన్న స్పందన కోలుకుంటేనే అసలు ఏం జరిగిందనే విషయం వెలుగులోకి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై తమకు కూడా ఏమీ అర్థం కావడం లేదని స్పందన బంధువు లక్ష్మీదేవి చెబుతున్నారు.
భార్య, చిన్నారి విషయంలో అసలు ఏం జరిగింది? స్పందన బెంగళూరుకు ఎలా వెళ్లింది? నెల రోజుల చిన్నారి అయ్యలూరు సమీపంలోని ముళ్లపొదల్లోకి ఎలా చేరింది? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానం లభించాల్సి ఉంది.




