Nandyal: నంద్యాల మున్సిపాలిటీలో 42 నుంచి 52 వార్డులుగా పునర్విభజన

Nandyal: నంద్యాల మున్సిపాలిటీని 42 నుంచి 52 వార్డులుగా పునర్విభజించనున్నారు. ప్రతిపాదిత సరిహద్దులపై సెప్టెంబర్ 11 వరకు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలు కోరుతున్నారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 5 Sept 2026 5:01 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల మున్సిపాలిటీలో 42 నుంచి 52 వార్డులుగా పునర్విభజన

నంద్యాల: పురపాలక సంఘంలో ప్రస్తుతం ఉన్న 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజించే ప్రక్రియకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ తదితర అంశాలపై కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో శనివారం చర్చించారు.

కమీషనర్ & డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సర్క్యులర్ ఆర్.ఓ. నెం.13032/2/2026/H1-2, తేదీ 01-09-2026 ద్వారా, అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు W.P.No.15045/2026లో తేదీ 03-09-2026న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నంద్యాల పురపాలక సంఘంలోని ప్రస్తుత 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజించేందుకు కొత్త షెడ్యూల్ జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ కు నివేదించారు.

ఈ మేరకు ఫారం నెం.1 / రూల్ 4(i) నోటిఫికేషన్ ద్వారా ప్రతిపాదిత వార్డుల సరిహద్దులపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు మరియు అభ్యంతరాలను 7 రోజుల వ్యవధిలో, అనగా 05-09-2026 నుంచి 11-09-2026 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం వార్డుల సరిహద్దుల వివరణతో కూడిన ఫారం నెం.1 / రూల్ 4(i) నోటిఫికేషన్ ప్రతులను జిల్లా కలెక్టర్ కార్యాలయం - నంద్యాల, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం - నంద్యాల, తహసీల్దార్ కార్యాలయం - నంద్యాల, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం - నంద్యాల, ఎంపీడీవో కార్యాలయం - నంద్యాల, హెడ్ పోస్టాఫీసు మరియు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

నంద్యాల పురపాలక సంఘ పరిధిలోని ప్రజలు ప్రతిపాదిత వార్డుల సరిహద్దులను పరిశీలించి, తమకు ఏవైనా సలహాలు, సూచనలు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని సంబంధిత ఆధారాలతో సహా 05-09-2026 నుంచి 11-09-2026 లోపు మున్సిపల్ కమిషనర్, నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో లిఖితపూర్వకంగా సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. వార్డుల పునర్విభజన ప్రక్రియలో నిర్దేశిత నిబంధనలు, నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధివిధానాలు మరియు గడువును కచ్చితంగా పాటిస్తూ, ప్రజల నుంచి అందే అభిప్రాయాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story