Nandyal: పొట్టిపాడులో రైతులకు కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి

Nandyal: నంద్యాల జిల్లా పొట్టిపాడులో రైతులకు రాజముద్ర కొత్త పాసుపుస్తకాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేసి, సీసీ రోడ్లను ప్రారంభించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 3 Aug 2026 4:30 PM IST
Nandyal
X

Nandyal: పొట్టిపాడులో రైతులకు కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి

నంద్యాల జిల్లా...

కోవెలకుంట్ల మండలం పొట్టిపాడు గ్రామంలో అన్నదాతలకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

అనంతరం పొట్టిపాడు గ్రామం బీసీ & ఎస్సీ కాలనీల్లో దాదాపు రూ. 35 లక్షలు వెచ్చించి నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లును ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

పొట్టిపాడు గ్రామానికి విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు

కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక రైతులు, ప్రజలు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు

గత ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకాలు తప్పులు తడకగా మార్చి రైతన్నలకు కంటిమీద కునుకు లేకుండా చేశారన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

చంద్రబాబు నాయకత్వంలో “రాజముద్ర”తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీతో రైతన్నల హక్కులను సంరక్షిస్తున్నాం..

అన్నదాతలకు ఇచ్చిన మాటకు కట్టుబడి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి రైతన్నల హక్కులను పరిరక్షించాం

భూమే ప్రాణంగా బతికే రైతులకు భూసమస్యలు లేకుండా చేయడం మా కూటమి ప్రభుత్వ లక్ష్యం.

గత ప్రభుత్వం రీ సర్వే పేరిట రైతుల భూముల్లో అనేక అక్రమాలకు పాల్పడింది

ఎక్కడ చూడని విధంగా మన పూర్వీకుల ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు

ఎవడబ్బ సొమ్మని నీ ఫోటోలు వేసుకుంటావని నాడు ప్రతిపక్షంగా నిలదీశాం

నాటి రీసర్వే తప్పులను సరిదిద్ది, నేడు పట్టాదారు పాస్ బుక్ లపై రాజముద్ర వేసి రైతుల హక్కులు కాపాడుతున్నాం

తల్లిదండ్రులు నుంచి, కష్టార్జితంగా వచ్చిన భూమిపై అన్నదాతలు ఎంతో మమకారం పెంచుకుంటారు

వైసిపి ప్రభుత్వం రైతన్నల భావోద్వేగాలతో ఆడుకుంది

ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాల్లో ఏవైనా తప్పులు ఉంటే అధికారులు దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారు కార్యక్రమంలో టిడిపి నాయకులు సుబ్బారెడ్డి బనగానపల్లె ఆర్డిఓ నరేంద్ర నాథ్ రెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story