Banaganapalle: అదృశ్యం డ్రామా ఫ్లాప్.. భార్యను చంపిన కిరాతకుడు!
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బీరవోలులో అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త వెంకటస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Banaganapalle: అదృశ్యం డ్రామా ఫ్లాప్.. భార్యను చంపిన కిరాతకుడు!
నంద్యాల జిల్లా: బనగానపల్లె మండలం బీరవోలు గ్రామంలో లక్ష్మి 35 అనుమానంతో భర్త వెంకటస్వామి అతని సోదరులు కలిసి హత్య చేశారు భార్యపై అనుమానంతోభర్త నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు ఈనెల 2 వ తేదీన భర్త వెంకటస్వామి తన భార్య లక్ష్మి అదృష్టమైందని నందివర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి విచారణ చేపట్టగా బీరవోలు గ్రామ సమీపంలో భర్త వెంకటస్వామి భార్య లక్ష్మిని గొంతు నులిమి చంపేశారు హత్య చేసి ఎస్ఆర్బిసి కాలువ పక్కల పూడ్చి పెట్టామని నేరం ఒప్పుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయించి వైద్యులతో పంచనామా చేయించారు నిందితుల పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచగా మెజిస్ట్రేట్ రిమాండ్ కు తరలించినట్టు బనగానపల్లె రూరల్ సిఐ మంజునాథరెడ్డి మీడియాతో తెలిపారు.




