Nandyal: నంద్యాలలో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కలకలం.. వీఆర్‌ఓ మల్లారెడ్డి సస్పెన్షన్
Nandyal: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామంలో ప్రభుత్వ పోరంబోకు భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వీఆర్‌ఓ మల్లారెడ్డి సస్పెన్షన్.
Nandyal: నంద్యాలలో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కలకలం.. వీఆర్‌ఓ మల్లారెడ్డి సస్పెన్షన్
నంద్యాల: ప్రభుత్వ భూములు, గ్రామకంఠం, పోరంబోకు భూముల విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ హెచ్చరించారు. ప్యాపిలి మండలం మాధవరం గ్రామంలో గతంలో వీఆర్‌ఓగా పనిచేసిన మల్లారెడ్డి, సర్వే నంబర్ 507లోని గ్రామకంఠం (ప్రభుత్వ పోరంబోకు) భూమిని సరైన ఆధారాలు, సహాయక పత్రాలు లేకుండా ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినట్లు అందిన ఫిర్యాదుపై జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు.
విచారణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం డోన్-1 క్లస్టర్ వీఆర్‌ఓగా పనిచేస్తున్న మల్లారెడ్డిని బుధవారం సస్పెండ్ చేసినట్లు జాయింట్ కలెక్టర్ నేడోక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.




