Nandyal: నందికొట్కూరు రెవెన్యూ శాఖలో చిన్న సంతకానికీ డబ్బుల డిమాండ్!
Nandyal: నందికొట్కూరు రెవెన్యూ శాఖలో విచ్చలవిడి అవినీతి; కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం డబ్బులు వసూలు చేస్తుండటంతో ప్రజల ఆగ్రహం.
Nandyal: నందికొట్కూరు రెవెన్యూ శాఖలో చిన్న సంతకానికీ డబ్బుల డిమాండ్!
Nandyal: ప్రభుత్వం "ప్రజా పాలన - అవినీతి రహిత పాలన" అని గొప్పలు చెప్పుకుంటున్నా, నందికొట్కూరు రెవెన్యూ శాఖలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.జనన,మరణ ధృవీకరణ పత్రాలు అలాగే కుల ధృవీకరణ పత్రాలు ఇలా ఏది కావాలన్నా మామూలు ఇవ్వాల్సిందే. "చిన్న సంతకానికైనా మజూరు కట్టాల్సిందే" అన్న స్థాయికి రెవెన్యూ వ్యవస్థ దిగజారిపోయింది.
రోజూ వందల మంది రైతులు, నిరుపేదలు ఆదాయ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ, భూ సంబంధిత పనుల కోసం మండల రెవెన్యూ కార్యాలయానికి వస్తున్నారు. కానీ ఫైల్ ముందుకు కదలాలంటే మామూలు లేకుండా కుదరడం లేదు.
బాధితులు చెప్పేదేమిటంటే - "సార్ ఒక్క సంతకం కోసం 3 రోజులుగా తిరుగుతున్నాం. డబ్బు ఇవ్వమంటున్నారు. ఇవ్వకపోతే మీ ఇష్టం రోజులు తరబడి తిరగాల్సిందే,అని చెబుతూ ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు.
తహసీల్దార్, RI స్థాయి అధికారుల ఒత్తిడి వల్లనే తాము ఇలా చేస్తున్నాము అంటూ కింది స్థాయి సిబ్బంది చెప్తున్న పరిస్థితి.
"ఒకప్పుడు రెవెన్యూ ఆఫీస్ అంటే న్యాయం జరిగే చోటు. ఇప్పుడు దోపిడీకి కేంద్రంగా మారింది" అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మరో నిరుద్యోగి మాట్లాడుతూ "సర్టిఫికెట్ కోసం 500-1000 అడుగుతున్నారు. మా దగ్గర అంత డబ్బు ఎక్కడిది?" అని ప్రశ్నించాడు.
ఈ అవకతవకలపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, నందికొట్కూరు రెవెన్యూ డివిజన్ మొత్తంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుని, రెవెన్యూ సేవలను పారదర్శకంగా మార్చాలని కోరుతున్నారు.
కాగితం మీద ప్రభుత్వ పథకాలు బాగున్నా, గడప వద్దకు వచ్చేసరికి "లంచం" అనే గోడ అడ్డుపడుతోంది.




