Nandikotkur: బడి తెరిచిన వారానికే నందికొట్కూరులో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కొరత!

Nandikotkur: నందికొట్కూరు మండలంలో పాఠశాలలు తెరిచిన వారానికే ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్యపుస్తకాల కొరత.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 19 Jun 2026 5:14 PM IST
Nandikotkur
X

Nandikotkur: బడి తెరిచిన వారానికే నందికొట్కూరులో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కొరత!

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలో పాఠశాలలు తెరిచి పట్టుమని పది రోజులు అవ్వకముందే పాఠ్యపుస్తకాలు ఖాళీ. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యపై చూపుతున్న ప్రాముఖ్యత ఏపాటిదో అర్థం అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో లభ్యం కానీ పుస్తకాలు, ప్రైవేట్ పాఠశాలల్లో ఎలా లభ్యం అవుతున్నాయి అనేది పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్య అన్నది కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యేలా అగుపిస్తున్నది. మండల విద్యాధికారి పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమా లేకపోతే ప్రైవేటు పాఠశాలలతో కుమ్మక్కు అయ్యారా అనేది అంతుచిక్కని ప్రశ్నగా భావించవచ్చు. పీదవిద్యార్థులకు అందని పాఠ్యపుస్తకాలు విరివిగా ప్రైవేటు పాఠశాలల్లో దొరుకుతుండటం మండల విద్యాధికారి పర్యవేక్షణపై అనుమానాలు లేకపోలేదు.

మండలం లోని చాలా వరకు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు ఇప్పటికే ఖాళీ అయిన పరిస్ధితిలో తమ పిల్లలను బడికి పంపించాలా వద్ధా అని అనేక మంది విద్యార్థుల తల్లితండ్రులు అయోమయ పరిస్థితిలో ఉండటం శోచనీయం.

ఈ విషయం పై నందికొట్కూరు మండల విద్యాధికారిని వివరణ కోరగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం నుంచే తక్కువగా వచ్చాయని ,చాలా పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు అని వివరణ ఇవ్వడం జరిగింది.

ఇకపోతే ఈ నెల 15 వ తారీఖున పాఠశాలలు తెరవగా వారం తిరగ ముందే పుస్తకాలు కొన్ని తరగతుల విద్యార్థులకు అందుబాటులో లేకపోవడం వెనుకగల కారణాలు తెలియడం లేదు.

ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల్లో లభ్యం కాకపోవడంతో మరి అవే పుస్తకాలు ప్రైవేట్ పాఠశాలల్లో చీకటిగధుల్లో ఉంచి 1500/వరకు అమ్మడం వెనుక పలు అనుమానాలు లేకపోలేదు.

ఈ విషయం పై సీపీఐ (ఎం ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు ,మరియు కొంతమంది విద్యార్థుల తల్లి తండ్రులతో కలిసి ఎం. ఈ వో రామిరెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం సరఫరా చేసిన పుస్తకాలు విద్యార్థులకు అందకపోవడం వెనుక ఉన్న కారణాలు తెలియడం లేదు.

ప్రభుత్వ పాఠశాలల్లో లభ్యం కానీ పుస్తకాలు ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఎలా లభ్యం అవుతున్నాయో అర్థం కానీ పరిస్థితి. మరోవైపు పాఠ్యపుస్తకాల పేరుతో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడి ఇష్టారాజ్యంగా తయారు అయ్యింది.తాము చెప్పిన రేటుకే పుస్తకాలను కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై అధికారం మోపుతున్న పరిస్థితి.

ప్రైవేట్ పాఠశాలల్లో వసూలు చేస్తున్న అధిక ఫీజులు,పుస్తకాల పేరుతో చేస్తున్న దోపిడి పై మండల విద్యాధికారి పర్యవేక్షణ కొరవడింది అని చెప్పక తప్పని పరిస్థితి. అసలు ప్రైవేటు పాఠశాలల్లో మండల విద్యాధికారి తనిఖీలు చేస్తున్నారా అని అనుమానాలు లేకపోలేదు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాఠశాల విద్యపై క్షేత్ర స్థాయిలో మండల వైద్యాధికారులు అవలంబిస్తున్న వైఖరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పేదవిద్యర్థులకు మంచి విద్యను అందించాలని పలువురు విద్యార్థి తల్లితండ్రులు కోరుతున్నారు.

మండల విద్యాధికారి కార్యాలయ సిబ్బంది తీరుపై సర్వత్రా అనుమానాలు పుట్టుకొస్తుండటం చెప్పుకోతగ్గ విషయం. మండల విద్యాధికారి ఆఫీసులో కొత్తగా కొన్న మానిటర్ దగ్గరనుంచి చివరకు ఏ 4 సైజు పేపర్వరకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచే వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

మండల విద్యాధికారి కార్యాలయంలో కొనుగోలు చేసిన స్టేషనరీ అలగే అందులో పనిచేస్తున్న సిబ్బంది పని తీరుపై జిల్లా విద్యాధికారికి మరియు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు పలు విద్యార్థి సంఘాలు తెలిపారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story