Veldanda: పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్
Veldanda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చేర్కూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు.
Veldanda: పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్
వెల్దండ: స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనని పరిశీలించిన గ్రామ సర్పంచ్ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చేర్కూర్ గ్రామంలో సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు స్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.
అనంతరం సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రమైన, పౌష్టికాహారం అందించడం ప్రభుత్వం బాధ్యత అలాగే ప్రతిరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వండించాలని అన్నారు.
నాసిరకమైన బియ్యం కూరగాయలు ఇతర ఆహార పదార్థాలు సరఫరా చేసినట్లయితే తీసుకోవద్దని చెప్పారు,విద్యార్థులకు నాణ్యమైన విద్య పౌష్టికాహారం సురక్షితమైన వాతావరణం అందించడం ప్రభుత్వ బాధ్యత, అలాగే విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడొద్దు అని గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ బాలరాజు, ఉప సర్పంచ్ కొండల్, వార్డ్ మెంబర్ సామ కుమారస్వామి,కేశమోని జంగయ్య, మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.




