Nagarkurnool: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో అనారోగ్యంతో మృతి చెందిన మారేపల్లి నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి.
Nagarkurnool: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూల్: వెల్దండ మండల కేంద్రానికి చెందిన మారేపల్లి నిరంజన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మరణించడం జరిగింది.
విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి, మాజీ సర్పంచ్ ముక్తాల శేఖర్, మాజీ ఎంపిటిసి లింగం, మాజీ ఎంపిటిసి నిరంజన్,నాగులు నాయక్, మాజీ ఉపసర్పంచ్ నిరంజన్, మాజీ మండల అధ్యక్షులు జోగయ్య, పార్టీ సీనియర్ నాయకులు జంగిలి యాదగిరి,జంగిలి ఆనంద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మండల అధ్యక్షులు కొమ్ము నాగయ్య,సీనియర్ నాయకులు మంగళగిరి సత్యం,అంజి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




