Charakonda: చారగొండలో బీటెక్ విద్యార్థికి దాతల ఆర్థిక సహాయం
Charakonda: నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి కమల్ గౌడ్‌కు రూ. 60 వేల ఆర్థిక సహాయం అందించిన దాతలు.
Charakonda: చారగొండలో బీటెక్ విద్యార్థికి దాతల ఆర్థిక సహాయం
చారగొండ: కల్వకుర్తి నియోజకవర్గం చారగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన బాధగోని కమల్ గౌడ్ (తండ్రి జంగయ్య) బీటెక్ చదువుతున్న విద్యార్థి ఉన్నత చదువులకు దాతలు రూ.60 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు రూ. 30 వేలు, చారగొండ సర్పంచ్ గుండె విజయేందర్ గౌడ్ రూ.20 వేలు,మాజీ ఎంపీటీసీ గోపిడి శ్రీనివాస్ రెడ్డి రూ.10 వేల రూపాయలు ఆ విద్యార్థికి ఆర్థిక సహాయం చేశారు.
విద్యాభ్యాసానికి తోడ్పాటుగా నిలిచి సహాయం అందించడం అభినందనీయమని, విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దాతలకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు పగడాల ఆంజనేయులు, గోకారం సాయి, ఎర్రవల్లి మాజీ సర్పంచ్ సాయి తదితరులు పాల్గొన్నారు.
Next Story




