Nandyal: నందికొట్కూరులో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ పాల్గొన్న ఎంపీ!
Nandyal: నందికొట్కూరులో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని దేశభక్తి చాటారు.
Nandyal: నందికొట్కూరులో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ పాల్గొన్న ఎంపీ!
Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ, పట్టణంలోని పలు విద్యాసంస్థల నుండి భారీగా తరలివచ్చిన విద్యార్థులతో ఘనంగా నిర్వహించిన నంద్యాల ఏం.పై.బైరెడ్డి శబరి.
జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు, ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమై, నంద్యాల రోడ్డు మీదుగా ర్యాలీ పటేల్ సెంటర్ వద్దకు చేరుకుని పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, జాతీయగీతాన్ని ఆలపించిన అనంతరం
ఎంపీ డా. బైరెడ్డి శబరి మాట్లాడుతూ, 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలను చాటాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని, యువతలో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటాలని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




