Kurnool: కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు!

Kurnool: కృష్ణగిరి జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. పదో తరగతి ప్రతిభావంతులకు ₹10 వేలు నగదు ప్రోత్సాహకం ప్రకటన.

V RAMAMOHAN, KURNOOL
Published on: 31 Aug 2026 2:59 PM IST
Kurnool
X

Kurnool: కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు!

Kurnool: కృష్ణగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గధులతో పాటు విద్యార్థులకు కలిపిస్తున్న మౌలిక వసతులను ఆయన పరిశీలించారు..విద్యార్థుల హాజరు శాతం రిజిస్టర్లను తనిఖీ చేసి బడికి రాని పిల్లల గురించి ఆరా తీశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎంపీ పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు.

పదవ తరగతిలో 500 మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10 వేలు నగదను అందజేస్తానన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమైన ఎంపీ నాగరాజు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు సమస్యలను ఉపాధ్యాయులు ఎంపీ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story