Giddalur: గిద్దలూరులో స్వచ్ఛ ఆంధ్ర చీపురు పట్టిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!
Giddalur: గిద్దలూరు పొట్టి శ్రీరాములు రోడ్డులో 'స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమం. బల్క్ వేస్ట్ జనరేటర్ల లెక్కింపు ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.
Giddalur: గిద్దలూరులో స్వచ్ఛ ఆంధ్ర చీపురు పట్టిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!
Giddalur: గిద్దలూరు పురపాలక సంఘం పరిధిలోని పొట్టి శ్రీరాములు రోడ్డులో కీర్తి మెడికల్ స్టోర్ సమీపంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన "బల్క్ వేస్ట్ జనరేటర్ల (BWGs) గుర్తింపు మరియు లెక్కింపు ప్రచార కార్యక్రమంలో శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా రోడ్లు , పరిసర ప్రాంతాలు చీపురుతో ఊడ్చి శుభ్రంచేసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛమైన , పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే సంస్థలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు తదితర బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి , వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయంగా చేపట్టడం ద్వారా పరిశుభ్రతను మరింత మెరుగుపరచవచ్చని తెలిపారు.
ప్రజలందరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని దోమలు వల్ల కానీ మరే ఇతర విషయాల వల్ల అంటు వ్యాధులు రాకుండా చూసుకోవాలి అని తెలిపారు ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.




