Orvakal: ఓర్వకల్లులో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ!
Orvakal: ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయంలో ‘మీ భూమి–మీ హక్కు’.. లబ్ధిదారులకు రాజముద్ర పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి.
Orvakal: ఓర్వకల్లులో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ!
Orvakal: ఓర్వకల్లు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన "మీ భూమి–మీ హక్కు" కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి.
ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్య అతిథులుగా పాల్గొని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. భూ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ కట్టుబాటుతో పనిచేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి తెలియజేశారు.
అంతేకాకుండా ఈ కార్యక్రమంలో యన్ కొంతలపాడు గ్రామం లో నూతన సుంకులమ్మ అమ్మవారి ఆలయం కు 20 సెంట్ల స్థలాన్ని కేటాయించి,మంజూరు పత్రాన్ని గ్రామస్తులకు ఎమ్మెల్యే మరియు మండల తహసీల్దార్ అందజేశారు.




