Kodumuru: యనగండ్లలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం

Kodumuru: యనగండ్లలో 'ఇంటింటికీ టీడీపీ'లో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

C. Ganesh, Kodumuru
Published on: 27 July 2026 5:52 PM IST
Kodumuru
X

Kodumuru: యనగండ్లలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం

కర్నూలు జిల్లా:

ఇంటి ఇంటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి అన్నారు. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం యనగండ్ల గ్రామంలో నిర్వహించిన 'ఇంటింటికీ టిడిపి' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story