Veligonda: వెలిగొండ పనులపై మంత్రి గ్రౌండ్ రిపోర్ట్
Veligonda: వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్‌లో 20 గంటల పాటు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన. టిబిఎం మిషన్ తొలగింపుపై హైకోర్టు స్టే ఎత్తివేత.
Veligonda: వెలిగొండ పనులపై మంత్రి గ్రౌండ్ రిపోర్ట్
Veligonda: దాదాపు 20గంటలు వెలిగొండ టన్నెల్స్ లోనే ఉండి లైనింగ్, బెంచింగ్, పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వానికి వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కు వెలిగొండ పూర్తి చేసి ఇవ్వాలనే ధృడ సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. వారం, వారం వెలిగొండ ప్రాజెక్టు పనులపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు పనులపై సిఎం చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందిస్తాను. రాత్రి, పగలు టన్నెల్స్ లోనే ఉండి, 5 గ్యాంట్రీల పనితీరును పరిశీలించాను. క్లిష్టమైన టన్నెల్స్ లో రాత్రింభవళ్ళూ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు భరోసా కల్పించడానికి, ఉత్తేజాన్ని, విశ్వాశాన్ని పెంచడానికి టన్నెల్స్ లో గడిపాను.
ప్రాజెక్టు అవశ్యకతను కార్మికులు, అధికారులకు తెలియజేయడానికే రాత్రి, పగలు టన్నెల్స్ లో ఉండి పనులను పరిశీలించాను. టన్నెల్-2లో 12వ కి.మీ దగ్గర 9.8మీ వ్యాసం, 175మీ పొడవు ఉన్న టిబిఎం మిషన్ టన్నెల్ లో చిక్కకుపోయింది. టన్నెల్ లో చిక్కకున్న టిబిఎం మిషన్ తొలగింపు పై హైకోర్టులో స్టే ఉంటే గత వైసిపి ప్రభుత్వం స్టే తీసేయించే ప్రయత్నం చేయలేదు.
చంద్రబాబు, అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి టిబిఎం తొలగింపు ఆవశ్యకతను వివరించి స్టే తొలగించారు. త్వరలోనే నిర్వాసితులకు 900 కోట్లు అందిచబోతున్నాం. టన్నెల్స్ నుండి నీళ్ళు తరలించాలంటే టిబిఎం తొలగించాల్సిందే. టిబిఎం తొలగించడానికి మాన్యుఫాక్చరింగ్ కంపెనీతో సంప్రదింపులు చేస్తున్నాం. వీలైనంత త్వరగా టిబిఎం తొలగించేలా యాక్షన్ ప్లాన్ కోసం షెడ్యూల్ తయారు చేయాలని అధికారులను ఆదేశించాం.
వెలిగొండ పూర్తవ్వకుండానే జాతికి అంకితం అంటూ మోసం,దగా చేసిన జగన్ అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు. 22 నెలల్లోనే రాష్ట్రంలో సాగు, తాగు నీరు అందిస్తూ చంద్రబాబు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే, జగన్ రక్త పాతం పారిస్తున్నాడు.
చంద్రబాబు లా నీరు పారించేవాళ్ళు కావాలో, జగన్ లా రక్తం పారించే వాళ్ళు కావాలో ప్రజలే తేల్చుకోవాలి. రాష్ట్రాన్ని 2047 నాటికి అగ్రగామిగా నిలపాలని చంద్రబాబు పని చేస్తుంటే, జగన్ అభివృద్ధికి ఆటంకం కల్గిస్తున్నాడు. గొడ్డలి సంస్కృతిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది గొడ్డలి పార్టీ.




