Nandyal: అర్హులైన ప్రతి ఒక్కరికీ 3 సెంట్ల ఇంటి స్థలం మంత్రి జనార్దన్!

Nandyal: 'హౌసింగ్ ఫర్ ఆల్' పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్డీవో నరేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 12 Aug 2026 1:13 PM IST
Nandyal
X

Nandyal: అర్హులైన ప్రతి ఒక్కరికీ 3 సెంట్ల ఇంటి స్థలం మంత్రి జనార్దన్!

Nandyal: బనగానపల్లె పట్టణంలో హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం జీవో నెంబర్ 23 రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఇంటి స్థలం లేని వారికి మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తామని బనగానపల్లె ఆర్డిఓ నరేంద్ర రెడ్డి మీడియాకు తెలిపారు

బనగానపల్లె పట్టణంలో 3100 ఇంటి స్థలాలు వెరిఫికేషన్ చేశామని ఆర్డిఓ అన్నారు. ఆధార్ నెంబర్ సంబంధిత సచివాలయాలలో అప్లై చేసుకోవాలని ఆర్డిఓ నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బనగానపల్లెలో ఇంటి స్థలాలు ఇస్తామని మాట ఇచ్చాను నా చిరకాలవంచ నెరవేరుస్తున్నాను.

గత ప్రభుత్వంలో మూడు వేల మంది అర్జీలు ఇచ్చారు కొన్ని కోర్టు కేసులో ఉన్నాయి,1800 మంది ఇతర మండలాలకు చెందిన వారి పేర్లు ఉన్నాయి . వాటిని అనర్హులుగా ప్రకటించాము గైడెన్స్ ప్రకారంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇంటి స్థలాలు ఇస్తాం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

బనగానపల్లె పట్టణంలో ఎవరికైనా ఇంటి స్థలాలు ఇస్తామని డబ్బులు అడిగితే ఇవ్వకండి మంత్రి బీ.సి జనార్దన్ రెడ్డి. బనగానపల్లె పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇస్తాం, అక్టోబర్12 లోపల ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాకు తెలిపారు.

కార్యక్రమంలో బనగానపల్లె తహశీల్దార్ చంద్రశేఖర్ ఆర్డిఓ నరేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story