Markapuram: కృష్ణా జలాలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమా?: మంత్రి డోలా

Markapuram: వెలిగొండ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైసీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి డోలా, ఎమ్మెల్యే కందుల విమర్శ. ఈనెల 31న నల్లమలసాగర్‌కు నీటి విడుదల.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 Aug 2026 10:39 PM IST
Markapuram
X

Markapuram: కృష్ణా జలాలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమా?: మంత్రి డోలా

రు.Markapuram: మార్కాపురం జిల్లా కరువు ప్రాంత ప్రజలకు కృష్ణా జలాలు అందించే వెలిగొండ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు సరికాదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈనెల 31న నల్లమలసాగర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో మార్కాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి , కందుల నారాయణరెడ్డి తో కలిసి మాట్లాడారు.

వెలిగొండ ప్రాజెక్టును తమ కుటుంబమే పూర్తి చేసిందంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టు పనులను పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులకు వేగం పెంచి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నామని తెలిపారు.

ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా స్పష్టం చేశారు. మంచి కార్యక్రమంపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు.

మరోవైపు, మార్కాపురం జిల్లా ప్రజలకు తాగునీరు అందకుండా వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేపడుతున్న వెలిగొండ ప్రాజెక్టు కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story