Kurnool: డిసెంబర్ నాటికి బనగానపల్లె బైపాస్ సిద్ధం కావాలి.. మంత్రి బీసీ
Kurnool: నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు.
Kurnool: డిసెంబర్ నాటికి బనగానపల్లె బైపాస్ సిద్ధం కావాలి.. మంత్రి బీసీ
Kurnool: బనగానపల్లె వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బనగానపల్లె పట్టణంలో మైనార్టీ సోదరుల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాది ఖానా నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి. షాది ఖానా నిర్మాణ పనులు పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటున్న క్రమంలో పలు సూచనలు, సలహాలు చేసిన మంత్రి. అవుకుమెట్ట ప్రాంతంలో రహదారి విస్తరణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం. బనగానపల్లె పట్టణంలోని పాత ఎమ్మార్వో (ప్రస్తుత ఆర్టీవో) కార్యాలయం పునరుద్ధరణ పనులను పరిశీలించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేసిన మంత్రి,
పురాతన భవనంలో అత్యంత జాగ్రత్తగా పునరుద్ధరణ, మరమ్మత్తుల పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశం. బనగానపల్లెలోని కొండపేట శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి, బనగానపల్లె బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి. బైపాస్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంతోపాటు, శరవేగంగా పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశం. 2026 డిసెంబర్ నాటికి బనగానపల్లె ప్రజలకు బైపాస్ ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలన్న మంత్రి.




