Markapuram: ప్రపంచ దోమల దినోత్సవం వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ!
Markapuram: మార్కాపురంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా అధికారి రాహుల్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ.
Markapuram: ప్రపంచ దోమల దినోత్సవం వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ!
Markapuram: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కె. రాహుల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
“దోమలను నివారిద్దాం.. ఆరోగ్యాన్ని కాపాడుదాం” అనే నినాదంతో వైద్య సిబ్బంది ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, బోదకాలు, మెదడువాపు వంటి దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజలకు వివరించారు.
ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమతెరలు వినియోగించాలని, ప్రతి శుక్రవారం “ఫ్రైడే డ్రై డే” పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ యాగ్నిక్ మాట్లాడుతూ దోమలు పుట్టకుండా, కుట్టకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో పట్టణ వైద్యాధికారి డాక్టర్ పి. శ్రావణ తేజ, సబ్‌యూనిట్ అధికారి ఆర్. నాగేంద్రారెడ్డి, ఎంపీహెచ్‌వో బి. శ్రీకాంత్, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




