Markapuram: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి!

Markapuram: పెద్ద దోర్నాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఘోర ప్రమాదం. నూతన ట్రాన్స్‌ఫార్మర్ అమరుస్తుండగా విద్యుత్ షాక్‌తో చీరాలకు చెందిన కార్మికుడు దుర్గారావు మృతి.

Srikanth Singam, Markapur
Published on: 15 Sept 2026 11:56 AM IST
Markapuram
X

Markapuram: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి!

Markapuram: పెద్ద దోర్నాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చే పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

చీరాలకు చెందిన నన్నం దుర్గారావు (55), తండ్రి రామదాసు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతన ట్రాన్స్‌ఫార్మర్ అమర్చే పనుల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురికావడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.

ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు స్పందించినప్పటికీ అప్పటికే దుర్గారావు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో సబ్‌స్టేషన్‌లో విషాద వాతావరణం నెలకొంది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యుత్ అధికారుల ఏ ఈ బీమా నాయక్, si వెంకటరమణయ్య పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur