Markapuram: వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల.. కూటమి భారీ ట్రాక్టర్ల ర్యాలీ!

Markapuram: వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మార్కాపురంలో టీడీపీ, కూటమి శ్రేణుల భారీ ట్రాక్టర్ల ర్యాలీ.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 25 Aug 2026 5:17 PM IST
Markapuram
X

Markapuram: వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల.. కూటమి భారీ ట్రాక్టర్ల ర్యాలీ!

Markapuram: మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, నీటి విడుదలను పురస్కరించుకుని మార్కాపురంలో టీడీపీ, కూటమి శ్రేణులు భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్, యువ నాయకులు కందుల విఘ్నేష్ రెడ్డి,బిజెపి జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు నుంచి శ్రీ అల్లూరు పోలేరమ్మ దేవస్థానం వరకు ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేపట్టారు.

అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు సాకారమవడం చారిత్రాత్మక ఘట్టమని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, తాళ్లపల్లి సత్య నారాయణ, జువాజీ రామాంజి రెడ్డి మరియు కూటమి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story