Markapuram:18 ఏళ్లు నిండిన నిర్వాసితులకు పరిహారమై కలెక్టరేట్ నిరసన!

Markapuram: పరిహారం ఇవ్వకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వెలుగొండ నిర్వాసితులు హెచ్చరించారు. డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 10 Aug 2026 11:56 AM IST
Markapuram
X

Markapuram:18 ఏళ్లు నిండిన నిర్వాసితులకు పరిహారమై కలెక్టరేట్ నిరసన!

Markapuram:18 సంవత్సరాలు నిండిన నిర్వాసిత యువతకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు మార్కాపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.

వెలిగొండ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన యువతకు పరిహారం, పునరావాస ప్రయోజనాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుటుంబాలను ప్రాజెక్టు కోసం సర్వసం త్యాగం చేసినప్పటికీ, అర్హత ఉన్న యువతకు రావాల్సిన పరిహారం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

తమ సమస్యను ఇకనైనా పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నిర్వాసితులు హెచ్చరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story