Markapuram: పెద్దదోర్నాలలో ఘనంగా డ్రైవర్స్ డే వేడుకలు గుర్తింపు కార్డుల పంపిణీ

Markapuram: పెద్దదోర్నాలలో సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా డ్రైవర్స్ డే వేడుకలు. ఐడీ కార్డుల పంపిణీ, టెంట్ హౌస్ ప్రారంభించిన అధ్యక్షుడు షేక్ షేక్షావలి.

Srikanth Singam, Markapur
Published on: 1 Sept 2026 4:45 PM IST
Markapuram
X

Markapuram: పెద్దదోర్నాలలో ఘనంగా డ్రైవర్స్ డే వేడుకలు గుర్తింపు కార్డుల పంపిణీ

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల కేంద్రంలోని సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో డ్రైవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ షేక్షావలి ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

డ్రైవింగ్ వృత్తిలో నిత్యం ప్రజల రవాణా, సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రైవర్ల సేవలను ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు గుర్తుచేసుకున్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వాహనాలను నడపాలని, ప్రయాణికుల భద్రతకు ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డ్రైవర్లు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన సేఫ్టీ టెంట్ హౌస్‌ను యూనియన్ సభ్యుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. అనంతరం సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ షేక్షావలి యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. యూనియన్ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు అందజేయడం పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

తదనంతరం యూనియన్ సభ్యులు కలిసి అధ్యక్షుడు షేక్ షేక్షావలిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. డ్రైవర్ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం యూనియన్‌ను ముందుకు నడిపిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు, వెంకీ, విజయ్, రాజు, సర్దార్, చాంద్ తదితర టెంట్ హౌస్ యూనియన్ సభ్యులుడ్రైవర్లు పాల్గొని డ్రైవర్స్ డే వేడుకలను విజయవంతం చేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story