Markapuram: వినోదం ప్రాణాలకు ముప్పు కాకూడదు సీఐ అల్తాఫ్ హుస్సేన్!
Markapuram: మార్కాపురంలో అధిక శబ్దంతో డిజెలు వినియోగిస్తే చర్యలు తప్పవు: సీఐ అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరిక. శబ్ద పరిమితులు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి.
Markapuram: వినోదం ప్రాణాలకు ముప్పు కాకూడదు సీఐ అల్తాఫ్ హుస్సేన్!
Markapuram: అధిక శబ్దంతో DJలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగించవద్దని మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరించారు. అధిక శబ్దం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
వృద్ధులు, చిన్నారులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు అధిక శబ్దానికి దూరంగా ఉండాలని సూచించారు. DJలు, లౌడ్‌స్పీకర్లు వినియోగించే నిర్వాహకులు అనుమతించిన శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో ముందస్తు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. DJ సౌండ్ లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ,గ్రామీణ ఎస్సైలు విశ్వనాథరెడ్డి, వేమన తో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సిఐ అల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు.




