Markapuram: ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్!
Markapuram: మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 2009 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది.
Markapuram: ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్!
Markapuram: మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 2009 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. షరీఫ్, భద్ర, హాసన్, సాగర్, ప్రసాద్, శ్రీను పదోన్నతి పొందారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లను అభినందించారు. పోలీస్ శాఖలో పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుందని, ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ, విధుల్లో నిబద్ధతను కొనసాగించాలని సూచించారు.
పదోన్నతి పొందిన సిబ్బందికి పోలీస్ అధికారులు, తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పదోన్నతులు తమకు మరింత బాధ్యతను పెంచిందని సిబ్బంది పేర్కొన్నారు.
Next Story




