Markapuram: మార్కాపురంలో 84 మద్యం షాపుల రెన్యువల్.. ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఇవే!

Markapuram: మార్కాపురం పరిధిలోని 84 మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. అధిక ధరలకు విక్రయిస్తే రూ.10 లక్షల జరిమానా తప్పదని ఎక్సైజ్ హెచ్చరించింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 12 Sept 2026 8:55 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో 84 మద్యం షాపుల రెన్యువల్.. ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఇవే!

మార్కాపురం జిల్లా: మార్కాపురం జిల్లాలో 84 A4 మద్యం షాపుల లైసెన్సుల పునరుద్ధరణకు నోటిఫికేషన్ జారీ. 2026–27 సంవత్సరానికి 75 ఓపెన్ కేటగిరీ, 9 గీత కులాలకు రిజర్వు చేసిన మొత్తం 84 A4 షాపుల లైసెన్సులను పునరుద్ధరించనున్న ఎక్సైజ్ శాఖ.

సెప్టెంబర్ 12 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రస్తుత లైసెన్సుదారులు ఆన్‌లైన్‌లో Renewal దరఖాస్తులు చేసుకోవాలి. సెప్టెంబర్ 22న అర్హులైన వారికి Form A-4(R) ద్వారా లైసెన్సులు మంజూరు.

Renewal Retail Excise Taxను ఒకేసారి చెల్లించాలి. Annual RETను ఒకేసారి లేదా నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం. MRP కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తే మొదటి ఉల్లంఘనకే రూ.10 లక్షల జరిమానా. రెండోసారి ఉల్లంఘనకు లైసెన్స్ రద్దు చేసే అవకాశం.

ప్రతి షాపులో నాలుగు CCTV కెమెరాలు 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు. MRPల ప్రదర్శన, డిజిటల్ చెల్లింపుల సదుపాయం తప్పనిసరి. వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 14405ను షాపుల్లో ప్రముఖంగా ప్రదర్శించాలని ఎక్సైజ్ శాఖ సూచించింది. గడువులోపు Renewal ప్రక్రియ పూర్తి చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి (ఇన్‌చార్జ్) ఎస్‌కే. ఆయేషా బేగం తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM