Markapuram: వెలుగొండ నల్లమలసాగర్‌కు మార్కాపురం నియోజకవర్గ ప్రజలు!
Markapuram: వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శనకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక బస్సులు. గంటవానిపల్లి వద్ద కృష్ణమ్మకు పసుపు, కుంకుమ సమర్పించిన ప్రజలు.
Markapuram: వెలుగొండ నల్లమలసాగర్‌కు మార్కాపురం నియోజకవర్గ ప్రజలు!
Markapuram: వెలుగొండ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను తిలకించేందుకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
మార్కాపురం పట్టణంలోని వివిధ వార్డుల నుంచి ప్రజలు ప్రత్యేక బస్సుల్లో దోర్నాల మండలం గంటవానిపల్లి గ్రామంలోని ఫీడర్ కెనాల్ గేట్ల వద్దకు తరలివెళ్లారు. అంతకుముందు సప్తగిరి సెంటర్‌లోని పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గంటవానిపల్లి వద్ద కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, సారె సమర్పించి జలహారతి నిర్వహించారు. అనంతరం సందర్శకులకు భోజన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్ క్లస్టర్ ఇన్‌చార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 31న జాతికి అంకితం చేశారని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు చేసిన మేలును తరతరాలు గుర్తుంచుకుంటాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మా టిడిపి మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ వక్కలగడ్డ మల్లికార్జున, టిడిపి జిల్లా నాయకుడు తాళ్లపల్లి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక , మరియు మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.




