Markapuram: మార్కాపురంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’.. చీపురు పట్టిన కలెక్టర్, ఎమ్మెల్యే!

Markapuram: పట్టణ పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అన్న మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని కలెక్టర్ విజయ సునీత పిలుపు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 23 May 2026 11:42 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’.. చీపురు పట్టిన కలెక్టర్, ఎమ్మెల్యే!

Markapuram: మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కాపురం పట్టణం సెవెన్ హిల్స్ సెంటర్‌లో నిర్వహించిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యం వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎమ్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన వాతావరణం ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అవుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే, కలెక్టర్‌తో పాటు అధికారులు స్వయంగా రోడ్లపై చీపుర్లు పట్టి శుభ్రత కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ దృశ్యాలు స్థానిక ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్ రావు,మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story