Markapuram: తర్లుపాడులో పల్స్ పోలియో షురూ.. చిన్నారులకు చుక్కలు వేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్!

Markapuram: తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 28 Jun 2026 11:51 AM IST
Markapuram
X

Markapuram: తర్లుపాడులో పల్స్ పోలియో షురూ.. చిన్నారులకు చుక్కలు వేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్!

తర్లుపాడు (మార్కాపురం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో డ్రైవ్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, పోలియో వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడంలో పల్స్ పోలియో చుక్కలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.

మార్కాపురం జిల్లాలో ఈరోజు సుమారు 1.05 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొంటూ, ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రజలు, కూటమి శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story