Markapuram: రేషన్ కార్డుదారులకు అలర్ట్: ఈ-కేవైసీ తప్పనిసరి.. లేదంటే రేషన్ కట్!
Markapuram: మార్కాపురం జిల్లాలో రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియపై డీఎస్ఓ అంకయ్య సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇంకా 36 వేల మందికి పైగా కేవైసీ పెండింగ్‌లో ఉందని, వెంటనే పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.
Markapuram: రేషన్ కార్డుదారులకు అలర్ట్: ఈ-కేవైసీ తప్పనిసరి.. లేదంటే రేషన్ కట్!
మార్కాపురం: ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రేషన్ కార్డు లోని కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలని మార్కాపురం జిల్లా DSO డి . అంకయ్య అన్నారు . స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలో మొత్తం 1015212 మందికి గాను 948003 మంది ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారని, ఇంకా 36,735 మంది ఈ కేవైసీ చేయించుకోవలసి ఉందని, అలగే గిద్దలూరు మండలం లో మొత్తం 72382 మందికి గాను 67827 మంది ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారని, ఇంకా 2317 మంది ఈ కేవైసీ చేయించుకోవలసి ఉందని ఆయన అన్నారు.
EKYC చేయించుకొని వారికి భవిష్యత్తులో రేషన్ పంపిణీ విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున కార్డులోని సభ్యులందరూ సమీపంలో VRO దగ్గర గల జి ఎస్ డబ్ల్యూ ఎస్ మొబైల్ యాప్ ద్వారా గానీ సచివాలయంలో గాని సమీప రేషన్ దుకాణంలోని డీలర్ల ద్వారా గాని ఆధార్ కార్డు లేదా రైస్ కార్డు ద్వారా ఈ కేవైసీ చేయించుకోవాలని, అలాగే కార్డుదారులందరికీ ఈ కేవైసీ చేయించుకునేలా చూడాలని గిద్దలూరు డీలర్లు కు తగు సూచనలు జారీ చేయడం జరిగింది అలగే గిద్దలూరు మండలం లోని డీలర్లు కు పెండింగ్ E KYC లిస్ట్ ఇవ్వడం జరిగినది. ఈ సమావేశంలో తాసిల్దార్ m . ఆంజనేయ రెడ్డి, E DT. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




