Markapuram: మార్కాపురంలో మెగా డోనర్ శ్రీనివాస రెడ్డికి సన్మానం!

Markapuram: మార్కాపురంలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన ప్రధానోపాధ్యాయులు మార్తాల శ్రీనివాస రెడ్డిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాహుల్ ఘనంగా సత్కరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 14 Jun 2026 10:54 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో మెగా డోనర్ శ్రీనివాస రెడ్డికి సన్మానం!

మార్కాపురం: అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన సేవల ద్వారా సమాజానికి విశేష సేవలందించిన మార్తాల శ్రీనివాస రెడ్డిని ఘనంగా సత్కరించారు. మార్కాపురం మునిసిపల్ ఉన్నత పాఠశాల – ఏకలవ్య నగర్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఆయన అత్యధిక సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేయడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి పెద్ద ఎత్తున రక్తదాతలను సమకూర్చి అనేక మంది ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా వైద్య ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ రాహుల్, ఆసుపత్రి వైద్యులు, రెడ్‌క్రాస్ రక్త బ్యాంకు సిబ్బంది శ్రీనివాస రెడ్డి ని ఘనంగా సత్కరించి అభినందించారు. “రక్తదానం – ప్రాణదానం” అనే సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.

రక్తదానం వల్ల ఎటువంటి హాని కలగదని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని డాక్టర్ రాహుల్ పిలుపునిచ్చారు. “మీరు ఇచ్చే ఒక యూనిట్ రక్తం.. ఒక ప్రాణాన్ని కాపాడగలదు. ఒక కుటుంబంలో ఆశల దీపం వెలిగించగలదు” అని పేర్కొంటూ, అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ రక్తదాన ఉద్యమంలో భాగస్వాములు కావాలని డాక్టర్ రాహుల్ కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story