Markapuram: ప్రకాశం జనసేనలో ప్రక్షాళన.. మార్కాపురం పగ్గాలు ఆయనకే!
Markapuram: ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీ రద్దు తర్వాత పార్టీలో భారీ ప్రక్షాళనకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు.
Markapuram: ప్రకాశం జనసేనలో ప్రక్షాళన.. మార్కాపురం పగ్గాలు ఆయనకే!
మార్కాపురం: జనసేన పార్టీ మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా ఇమ్మడి కాశీనాథ్ ను నియమించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీలో ఉన్న గ్రూప్ ల పనితీరుపై ఇటీవల రాజమంద్ర నగరంలో జరిగిన ఆ పార్టీ అంతర్గత సమావేశంలో నాయకుల వ్యవహారాల శైలి పై వవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం,దీంతో అక్కడిక్కడే పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఊహంచని విధంగా పార్టీ అధినేత ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకపడడంతో జనసేన జిల్లా నేతలు ఖంగుతిన్నారు. పార్టీలో ప్రక్షాళన చేసి,కొత్తఉపును తెచ్చేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కు పార్టీ అధ్యక్షులుగా ఇమ్మడి కాశీనాథ్ ను నియమిస్తే బాగుంటుందని బావించి, ఆయనతో చర్చించగా, ఉమ్మడి జిల్లా కు వద్దని, మార్కాపురం జిల్లా వరకు బాధ్యతలు ఇస్తే తీసుకోవాడాని సిద్ధంగా వున్నట్లు కాశీనాథ్ పార్టీ నాయకత్వానికి చెప్పినట్లు తెలిసింది.
ఈయన జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో సొంత నిధులతో పార్టీ కార్యాలయాన్ని గత ఎన్నికలకు ముందే నిర్మించి, అప్పటినుండే పార్టీ కార్యకలాపాలను కొనసాగించారు. ఈయన నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి గా సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తూ పార్టీ రాష్ట్ర అధినేతను సైతం ఆకర్షించారని చెప్పవచ్చు.
ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో పార్టీ కమిటీలను నియమించి, ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఇలాంటి స్థితిలో ఇటు పార్టీ క్యాడర్ లో అటు ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన నాయకులకు పార్టీ పదవులను కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.
ఈ క్రమంలో నూతన మార్కాపురం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి అన్ని విధాలుగా ఇమ్మడి కాశీనాథ్ మాత్రమే సరైన నాయకుడని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలిసారిగా తమ నాయకుడు కాశీనాథ్ కు జిల్లా అధ్యక్ష పదవి వచ్చే అవకాశం వుండడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




