Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన వెలిగొండ నిర్వాసితులు

Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన వెలిగొండ నిర్వాసితులు; 18 ఏళ్లు నిండిన యువతకు వెంటనే ఆర్‌అండ్‌ఆర్ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 10 Aug 2026 12:55 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన వెలిగొండ నిర్వాసితులు

మార్కాపురం: కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన వెలిగొండ నిర్వాసితులు

ఆర్‌అండ్‌ఆర్ పరిహారం కోసం ఆందోళన.. సమస్య పరిష్కరించాలని డిమాండ్

మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. 18 సంవత్సరాలు నిండిన నిర్వాసిత యువతకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లో నిరసన వ్యక్తం చేశారు.

తమ సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడం లేదని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం, పునరావాస ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.

అర్హత ఉన్న నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఇళ్లను ఖాళీ చేయించవద్దని, సమస్యల పరిష్కారం అనంతరం కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని కోరారు. నిర్వాసితుల ఆందోళనతో కలెక్టరేట్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి , అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story