Markapur: దరిమడుగులో రీ సర్వే గ్రామసభ.. ఎమ్మెల్యే కందుల భాగస్వామ్యం!
Markapur: మార్కాపురం మండలం దరిమడుగులో రీ సర్వే గ్రామసభ నిర్వహణ. భూములకు ఖచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.
Markapur: దరిమడుగులో రీ సర్వే గ్రామసభ.. ఎమ్మెల్యే కందుల భాగస్వామ్యం!
Markapur: మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో రీ సర్వే గ్రామసభలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.
భూములకు ఖచ్చితత్వంతో సరిహద్దులు నిర్ణయించి, రైతులకు స్పష్టమైన భూ హక్కులు కల్పించడమే రీ సర్వే ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పట్టాదారు పాస్‌పుస్తకాలపై రాజకీయ నాయకుల చిత్రాలు ఉండటంతో రైతుల్లో అయోమయం నెలకొందని, ఇకపై ప్రభుత్వ రాజముద్రతో పాస్‌పుస్తకాలు అందిస్తామని చెప్పారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం ఆయకట్టు పరిధిలోకి వస్తుందని, పండ్ల తోటలను అభివృద్ధి చేసి హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలో కండపురాయికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ రామాంజి రెడ్డి ,ఎమ్మార్వో చిరంజీవి మరియు రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




