Markapur: పెద్దారవీడు మండలంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల కోసం ఇబ్బందులు!

Markapur: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో కొత్త పింఛన్ల దరఖాస్తుల కోసం గ్రామస్తుల పడిగాపులు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 Sept 2026 11:31 AM IST
Markapur
X

Markapur: పెద్దారవీడు మండలంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల కోసం ఇబ్బందులు!

Markapur: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు, కొత్తపల్లి గ్రామాల్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల అనంతరం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు అవకాశం కల్పించడంతో, దరఖాస్తుదారులు దేవరాజు గట్టు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

అయితే, నిన్నటి నుంచి సచివాలయాల వద్దకు వస్తున్నప్పటికీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు సమయం తక్కువగా ఉండటంతో పాటు, పింఛన్ కోసం ఏయే పత్రాలు, ఆధారాలు సమర్పించాలో స్పష్టత లేకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోందని వారు తెలిపారు.

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానం, అవసరమైన ధ్రువపత్రాలు, చివరి తేదీపై అధికారులు స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story