Markapur: మార్కాపురంలో రైతు బజార్‌కు ఘనంగా శంకుస్థాపన!

Markapur: తర్లుపాడు రోడ్డులో నూతన రైతు బజార్‌కు కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 Aug 2026 11:19 AM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో రైతు బజార్‌కు ఘనంగా శంకుస్థాపన!

మార్కాపురంలో రైతు బజార్‌కు శంకుస్థాపన

రైతులకు, వినియోగదారులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్ ,ఎమ్మెల్యే

న్యూస్ BY SREENIVAS YANNAM

మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన ఇన్‌చార్జ్ ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు, వినుకొండ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు వక్కలగడ్డ మల్లికార్జున, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం రైతు బజార్ ద్వారా కలుగుతుందని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు తాజా కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రైతు బజార్ నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మార్కెట్ యార్డు అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story