Markapuram: మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయ కోనేరు శుభ్రం!

Markapuram: మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కోనేరును పరిశుభ్రం చేయించిన అధికారులు. పారిశుధ్య కార్మికులకు, ఆర్‌డిఓకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 22 Aug 2026 3:52 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయ కోనేరు శుభ్రం!

Markapuram: మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కోనేరును పరిశుభ్రం చేయించిన ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి,మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఆలయ ఏవో గొలమారి శ్రీనివాసరెడ్డి, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు శిరిగిరి శ్రీనివాసులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

కోనేరులో నీరు నిల్వ ఉండి మురికిగా మారకుండా, భక్తులు, చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్యలు ఆలయ పరిసరాల పరిశుభ్రతకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ పారిశుధ్య పనుల్లో ఉత్సాహంగా పాల్గొన్న దాదాపు 40 మంది పారిశుధ్య కార్మికులు, శానిటరీ ఇన్‌చార్జీలకు ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కోనేరు పరిశుభ్రతకు ప్రత్యేక చొరవ తీసుకున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story