Markapur: లక్ష్మీ చెన్నకేశవ స్వామి పుష్కరిణిలో శుభ్రతా కార్యక్రమం!
Markapur: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ పుష్కరిణిలో చెత్త తొలగింపు. పుష్కరిణిలో చెత్త వేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈఓ గొలమారి శ్రీనివాస రెడ్డి హెచ్చరిక.
Markapur: లక్ష్మీ చెన్నకేశవ స్వామి పుష్కరిణిలో శుభ్రతా కార్యక్రమం!
Markapur: మార్కాపురంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ పుష్కరిణిలో చెత్తాచెదారాన్ని తొలగించే కార్యక్రమాన్ని ఆలయ ఈఓ గొలమారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. పవిత్రమైన పుష్కరిణిలో స్థానికులు చెత్తాచెదారం వేయవద్దని పలుమార్లు సూచించినప్పటికీ కొందరు నిబంధనలు పాటించడం లేదన్నారు. ఇకపై పుష్కరిణి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచుతామని తెలిపారు.
పుష్కరిణిలో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పోలీసుల సహకారంతో బాధ్యులపై చర్యలు చేపడతామని హెచ్చరించారు.
పవిత్రతను కాపాడటంలో ప్రజలు సహకరించాలని, ఇకపై పుష్కరిణిలో చెత్తాచెదారం వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఈఓ శ్రీనివాస్ రెడ్డి కోరారు.




