Markapur: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి ఏపీటీఎఫ్!
Markapur: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్-1938 నాయకులు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు.
Markapur: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి ఏపీటీఎఫ్!
Markapur: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్–1938 ఆధ్వర్యంలో బుధవారం మార్కాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత కు అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23(1)ను సవరించి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ప్రత్యేక టెట్‌లో అందరికీ 40 శాతం ఉత్తీర్ణత మార్కులు నిర్ణయించాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలనే పరీక్షలో ఇచ్చేలా సిలబస్‌లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని, ఇన్‌సర్వీస్ టెట్‌ను డిసెంబర్ నెలలో నిర్వహించాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జాతీయ కార్యదర్శి కేవీజీ కీర్తి, మార్కాపురం జిల్లా అధ్యక్షుడు రాచేటి సంజీవ్‌కుమార్, గౌరవాధ్యక్షుడు మంద బాలరాజు, తర్లుపాడు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్సీ కుమార్, యు.సుధాకర్‌తో పాటు పలువురు ఏపీటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




