Markapur: ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు!

Markapur: మార్కాపురం ZPHS ప్రాంగణంలో ముగిసిన 11వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు. బాలురలో చిత్తూరు, బాలికల్లో గుంటూరు జట్ల విజయం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 13 Sept 2026 5:12 PM IST
Markapur
X

Markapur: ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు!

Markapur: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ప్రాంగణంలో నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.

బాలుర విభాగంలో చిత్తూరు జిల్లా జట్టు విజేతగా నిలవగా, ఈస్ట్ గోదావరి రన్నరప్‌గా, శ్రీకాకుళం జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచాయి.

బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్టు ఛాంపియన్‌గా నిలవగా, నెల్లూరు రన్నరప్‌, విశాఖపట్నం జిల్లా జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ఫైనల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. విజేతలకు మార్కాపురం డీఆర్ఓ వెంకట శివరామిరెడ్డి, జనసేన మార్కాపురం జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి కాశీనాథ్ తదితర అతిథులు బహుమతులు అందజేశారు.

రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షులు విజయశంకర్ రెడ్డి, సెలక్షన్ కమిటీ అధ్యక్షులు మురళి పర్యవేక్షణలో పోటీలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా ముగిశాయి.

కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. దామోదర్ రెడ్డి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి ప్రగడ శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయులు, 13 జిల్లాల క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM