Markapur: వాగులో కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు!
Markapur: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో భారీ వర్షం. వరదనీటిలో కొట్టుకుపోయిన సునీల్ కుమార్‌ను జేసీబీ సహాయంతో సురక్షితంగా కాపాడిన ఎస్సై సాంబశివరావు.
Markapur: వాగులో కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు!
Markapur: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో రెండు గంటల పాటు భారీగా కురిసిన వర్షం కురిసింది. దీంతో తెల్లగట్ల వద్ద చప్టాపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా ఒరిస్సాకు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి అదుపు తప్పి వాగులో పడిపోయాడు.
యాభై మీటర్ల దూరం కొట్టుకొని పోయి చెట్ల మధ్య ఇరుక్కున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై సాంబశివరావు సంఘటనాస్థలానికి చేరుకుని.. జేసీబీ సహాయంతో చెట్ల మధ్య ఉన్న సునీల్ కుమార్ను సురక్షితంగా బయటకు తీసి రక్షించారు.




