Srisailam: నెల రోజుల్లోనే రూ. 5.06 కోట్ల రికార్డు హుండీ ఆదాయం!

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న ఆలయంలో జరిగిన హుండీల లెక్కింపులో గత 30 రోజులకు గాను రికార్డు స్థాయిలో రూ. 5.07 కోట్ల రాబడి, బంగారం, వెండి లభించాయి.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 22 July 2026 6:43 PM IST
Srisailam
X

Srisailam: నెల రోజుల్లోనే రూ. 5.06 కోట్ల రికార్డు హుండీ ఆదాయం!

శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ దేవి సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు బుధవారం నిర్వహించగా తద్వారా దేవస్థానానికి రూ. 5,06,97,110 /- లు రికార్డు స్థాయిలో నగదు రాబడిగా లభించింది.

కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 30 రోజులలో సమర్పించడం జరిగింది.

అలాగే ఈ హుండీలో 91 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారు, 3 కేజీల 160 గ్రాముల వెండి లభించాయి.అదేవిధంగా 1353 - యుఎస్ఏ డాలర్లు, 200– యు.ఏ.ఇ దిర్హమ్స్, 4 - సింగపూర్ డాలర్లు, 120 – ఇంగ్లాండు పౌండ్స్, 272 – మలేషియా రింగిట్స్, 10 – యూరోస్, 5 - కెనడా డాలర్లు, 50 – సౌత్ ఆఫ్రికా రాండ్స్ మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ హుండీల లెక్కింపును కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అదేవిధంగా హుండీల లెక్కింపులో పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story