Nandyal: మహానాడుకు సర్వం సిద్ధం.. వర్చువల్గా పసుపు పండుగ!
Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఘనంగా 'మహానాడు' ఏర్పాట్లు.
Nandyal: మహానాడుకు సర్వం సిద్ధం.. వర్చువల్గా పసుపు పండుగ!
నంద్యాల జిల్లా: మహానాడు విజయవంతానికి సమిష్టిగా కృషి చేయాలి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె అబ్జర్వర్ పర్వీన్ భాను లు పిలుపునిచ్చారు. ప్రతి ఏటా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని టిడిపి నాయకులు కార్యకర్తలు బిసి జనార్దన్ రెడ్డి అభిమానులు ప్రజలు కలిసి విజయవంతం చేయాలన్నారు. బనగానపల్లె మండలం అవుకు, కొలిమిగుండ్ల సంజామల కోవెలకుంట్ల మండలాలలో మహానాడు ఏర్పాటను పరిశీలించిన బనగానపల్లె అబ్జర్వర్ పర్వీన్ భాను అందులో భాగంగా దేశంలో సంక్షోభం నెలకొన్న సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదా చేయాలనే పిలుపు మేరకు ఈనెల 27 28వ తేదీన వర్చువల్ గా మహానాడు కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమాలకు అబ్జర్వర్ తెలుగుదేశం పార్టీకి చెందిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భానును బనగానపల్లె కు నియమించారు. బనగానపల్లె నియోజకవర్గానికి చేరుకొని 5 మండలాల్లో ఏర్పాటు చేయనున్న మహానాడు కార్యక్రమాలను తనిఖీ చేశారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఫంక్షన్ హాల్లో ఎల్ఈడి టీవీలతో వర్చువల్ గా మహానాడు కార్యక్రమం జరుగుతుందని అబ్జర్వర్ పర్వీన్ భాను తెలిపారు. విశాఖపట్నంలో ప్రారంభించి నెల్లూరులో ఖరారు చేసిన మహానాడు ఈసారి ప్రధాని మోడీ సూచనల మేరకు వర్చువల్ విధానంతో పొదుపు చర్యలతో నిర్వహిస్తున్నట్లు వివరించారు ప్రతి క్లస్టర్ పరిధిలో ఈ కార్యక్రమం పసుపు పండుగా జరుపుకోవాలని పార్టీ ఆదేశించిందని బనగానపల్లె అబ్జర్వర్ పర్వీన్ భాను తెలిపారు. గతంలో లేని విధంగా స్థానికంగా మహానాడు నిర్వహించుకునే అవకాశం వచ్చిందని సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త పాల్గొనాలని సూచించారు.




