Markapuram: సుంకేసుల నిర్వాసితులకు రవాణా ఇక్కట్లు!
Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో సుంకేసుల నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, నిత్యావసరాల పంపిణీ. అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు రవాణా లేక చిన్నపిల్లలతో ఇబ్బందులు పడ్డ బాధితులు.
Markapuram: సుంకేసుల నిర్వాసితులకు రవాణా ఇక్కట్లు!
Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో సుంకేసుల నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, రేషన్ కిట్లు, చీరల పంపిణీ చేపట్టారు. అయితే పంపిణీ అనంతరం సామగ్రితో ఇళ్లకు చేరేందుకు రవాణా సౌకర్యం లేక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చిన్నపిల్లలు, మహిళలతో కలిసి పట్టాలు, రేషన్ కిట్లు, ఇతర సామగ్రిని చేతబట్టుకుని ఆటోల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. కొందరు ఆటోల్లో సామగ్రితో పట్టణానికి చేరుకున్నారు.
పునరావాసం పేరుతో పంపిణీ కార్యక్రమం నిర్వహించినప్పటికీ, నిర్వాసితులకు మెరుగైన రవాణా ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది. ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు.
Next Story




