Markapuram: మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులుగా కేవీ రమణారెడ్డి

Markapuram: వైఎస్సార్సీపీ మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా గిద్దలూరు పరిశీలకుడు కేవీ రమణారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ ఉత్తర్వులు ఇచ్చింది.

MADARVALI, MARKAPURAM
Published on: 12 Sept 2026 5:17 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులుగా కేవీ రమణారెడ్డి

మార్కాపురం: వైఎస్సార్సీపీ మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా కేవీ రమణారెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేవీ రమణారెడ్డికి మార్కాపురం నియోజకవర్గ పరిశీలకులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. రానున్న రోజుల్లో పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ, సంబంధిత రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా కేవీ రమణారెడ్డి వ్యవహరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ.. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM