Kurnool: బీసీ విద్యార్థుల సమస్యలపై ఏపీ బీసీ సంక్షేమ కార్యదర్శికి వినతి
Kurnool: బీసీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ VVS వ్యవస్థాపక అధ్యక్షుడు పగడాల ఆనంద్ బాబు ఆధ్వర్యంలో ఏపీ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
Kurnool: బీసీ విద్యార్థుల సమస్యలపై ఏపీ బీసీ సంక్షేమ కార్యదర్శికి వినతి
కర్నూలు: బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా, సంక్షేమ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వ విద్యార్థి సేన (VVS) ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు పగడాల ఆనంద్ బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిని రాష్ట్ర సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి, విద్యా వనరులు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై చర్చించారు. అలాగే బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో విద్యార్థులు, ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన కొన్ని కార్యక్రమాలను కార్యదర్శి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. VVS ప్రతినిధుల వినతిపై సానుకూలంగా స్పందించి, విద్యార్థుల సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
బీసీ విద్యార్థులకు విద్య, వసతి, సంక్షేమం, సమాన అవకాశాలు అందే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని VVS వ్యవస్థాపక అధ్యక్షుడు పగడాల ఆనంద్ బాబు తెలిపారు.




