Kurnool: వాల్మీకి బోయ సమాజ ఆత్మగౌరవాన్ని కాపాడాలి

Kurnool: కర్నూలు జిల్లా కేతవరం గ్రామంలోని వాల్మీకి మహర్షి దేవాలయ సర్వే నెం. 85 భూమికి శాశ్వత పట్టా ఇవ్వాలని పాణ్యం ఎమ్మెల్యేకు వినతి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 24 July 2026 7:42 PM IST
Kurnool
X

Kurnool: వాల్మీకి బోయ సమాజ ఆత్మగౌరవాన్ని కాపాడాలి

కర్నూలు: కేతవరం గ్రామంలోని వాల్మీకి మహర్షి దేవాలయం ఉన్న సర్వే నెం.85 భూమికి శాశ్వత పట్టా మంజూరు చేసి, ఆలయ ఆస్తిని శాశ్వతంగా రక్షించాలని కోరుతూ మహర్షి వాల్మీకి బోయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, బోయ వాల్మీకి సమితి ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

బోయ వాల్మీకి సమితి నాయకులు మాట్లాడుతూ, కేతవరం గ్రామానికి ఆధ్యాత్మిక, చారిత్రక గుర్తింపుగా నిలిచిన వాల్మీకి మహర్షి ఆలయం భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువుగా ఉందని పేర్కొన్నారు. ఆలయం ఉన్న సర్వే నెం.85 భూమికి శాశ్వత పట్టా మంజూరు చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ పరిరక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారుల నుంచి పూర్తి నివేదికలు తెప్పించి, అన్ని కోణాల్లో పరిశీలించి వాల్మీకి బోయ సమాజానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహర్షి వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జుల గౌరీశ్వర నాయుడు, జిల్లా కార్యదర్శి బోయ చంద్రశేఖర్, నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు, బోయ వాల్మీకి సమితి రాష్ట్ర అధ్యక్షులు తలారి అంజితో పాటు కేతవరం గ్రామానికి చెందిన వాల్మీకి బోయ మహిళలు, పురుషులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటారు.

సమాజ పెద్దలు మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి ఆలయ భూమికి శాశ్వత పట్టా మంజూరు చేయడం కేవలం ఒక భూమి సమస్య మాత్రమే కాదని, వాల్మీకి బోయ సమాజ ఆత్మగౌరవం, ఆధ్యాత్మిక వారసత్వం మరియు గ్రామ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story